ananth kumar: ముగిసిన అనంత్ కుమార్ అంత్యక్రియలు.. హాజరైన అద్వాణీ, అమిత్ షా

  • బీజేపీ కార్యాలయంలో నివాళి అర్పించిన వెంకయ్య
  • చామరాజపేట్ శ్మశానవాటికలో అంత్యక్రియలు
  • ఊపిరితిత్తుల కేన్సర్ తో తుదిశ్వాస విడిచిన అనంత్ కుమార్

కేంద్ర మంత్రి అనంత్ కుమార్ అంత్యక్రియలు బెంగళూరులో అధికారిక లాంఛనాల మధ్య ముగిశాయి. అంత్యక్రియలకు బీజేపీ అగ్రనేత అద్వాణీ, అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, రవిశంకర్ ప్రసాద్, పియూష్ గోయల్ తో పాటు కర్ణాటక బీజేపీ, కాంగ్రెస్, జేడీయూ నేతలు హాజరై... తుది వీడ్కోలు పలికారు.

ఈ ఉదయం ఆయన భౌతికకాయాన్ని ఆయన నివాసం నుంచి బీజేపీ కార్యాలయానికి తీసుకొచ్చారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆయన పార్థివ దేహానికి నివాళి అర్పించారు. అనంతరం ప్రజల సందర్శనార్థం ఆయన భౌతిక కాయాన్ని నేషనల్ కళాశాల మైదానానికి తరలించారు. అక్కడి నుంచి అంతిమయాత్ర చేపట్టి... చామరాజపేట్ శ్మశానవాటికలో అంతిమసంస్కారాలను నిర్వహించారు. ఊపిరితిత్తుల కేన్సర్ తో అనంత్ కుమార్ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే.

ananth kumar
advani
amith shah
Venkaiah Naidu
funerals
  • Loading...

More Telugu News