Vivo Z1 Lite: అధునాతన ప్రాసెసర్, డ్యూయల్ కెమెరాలతో వివో నుండి నూతన స్మార్ట్ ఫోన్!

  • 'వివో జెడ్1 లైట్' విడుదల 
  • మూడు రంగులలో లభ్యం 
  • ధర సుమారుగా రూ.11,400

వివో సంస్థ తాజాగా చైనాలో 'వివో జెడ్1 లైట్' పేరిట నూతన స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. ఈ ఏడాది మొదట్లో విడుదల చేసిన 'వివో జెడ్1'కి డౌన్ వెర్షన్ లో భాగంగా 'వివో జెడ్1 లైట్' ఫోన్ ని విడుదల చేశారు. డిజైన్, లుక్ తో పాటు అధునాతన ప్రాసెస్సర్ ని 'జెడ్1 లైట్' లో ఏర్పాటు చేశారు. అరోరా పర్పుల్, బ్లాక్, రెడ్ కలర్లలో లభించే ఈ ఫోన్ మన దేశంలో సుమారుగా రూ.11,400 ధరకి వినియోగదారులకి అందుబాటులో ఉండనుంది.

'వివో జెడ్1 లైట్' ప్రత్యేకతలు:

  • స్నాప్ డ్రాగన్ 626 ప్రాసెస్సర్
  • వెనక భాగంలో రెండు 16/2 మెగాపిక్సెల్ కెమెరాలు
  • ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా
  • 4 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
  • 6.26" ఫుల్ హెచ్‌డీ డిస్ప్లే (1080x2280 పిక్సెల్ రిజల్యూషన్ )
  • ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం
  • 3260ఎంఏహెచ్ బ్యాటరీ

Vivo Z1 Lite
vivo
smartphone
Tech-News
techcology
China
Snapdragon
  • Loading...

More Telugu News