rajani: అలరిస్తోన్న '2.ఓ' తెలుగు లిరికల్ వీడియో

  • శంకర్ రెడీ చేస్తోన్న '2.ఓ'
  • సంగీత దర్శకుడిగా రెహ్మాన్ 
  • ఈ నెల 29వ తేదీన రిలీజ్  

శంకర్ దర్శకత్వంలో రూపొందిన '2.ఓ' సినిమా ఈ నెల 29వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇటీవల వదిలిన ట్రైలర్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలోనే తాజాగా తెలుగు వెర్షన్ కి సంబంధించిన లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. "నా ప్రియమౌ ప్రియమో బ్యాటరివే విడిచి వెళ్లిపోవద్దే .. నా ప్రియమౌ ప్రియమో బ్యాటరివే అసలేం తరగొద్దే .. యంతర లోకపు సుందరివే .. అంకెల కవితలు సెండుదువే" అంటూ ఈ పాట కొనసాగుతోంది.

ఏఆర్ రెహ్మాన్ స్వరపరిచిన ఈ పాట అంతా కూడా కంప్యూటర్ పరిజ్ఞానానికి సంబంధించిన పదాలను ఎక్కువగా ఉపయోగిస్తూ రాశారు. రోబోస్ రూపంలోని నాయకా నాయికలు పాడుకునేదిగా ఈ పాటను ట్యూన్ చేశారు. 'నా వైఫై వైఫే నువ్వే' అనే పద ప్రయోగాలు బాగున్నాయి. 'నీ బస్ కి కండక్టర్ నే' అనే లైన్ రజనీ అభిమానులను ఉత్సాహ పరుస్తుంది. ఎందుకంటే రజనీ సినిమాల్లోకి రాకముందు బస్ కండక్టర్ గా పనిచేసిన సంగతి తెలిసిందే. 

rajani
akshay
amy jackson
  • Error fetching data: Network response was not ok

More Telugu News