TRS: రాజయ్యకు ఇంటిపోరు... కాంగ్రెస్ తరఫున బావమరిది భార్య!

  • టీఆర్ఎస్ తరఫున తాజా మాజీ ఎమ్మెల్యే రాజయ్య
  • సింగాపురం ఇందిరను బరిలో నిలిపిన కాంగ్రెస్
  • రాజయ్యకు గట్టిపోటీ అంటున్న విశ్లేషకులు

వరంగల్ జిల్లా స్టేషన్ ఘనపూర్ అసెంబ్లీ ఎన్నిక అత్యంత ఆసక్తికరంగా సాగనుంది. ఇక్కడ ప్రధాన పార్టీల అభ్యర్థులు దగ్గరి బంధువులు కావడమే విశేషం. టీఆర్ఎస్ తరఫున తాజా మాజీ ఎమ్మెల్యే రాజయ్య మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుండగా, ఆయనపై పోటీగా కాంగ్రెస్ పార్టీ సింగాపురం ఇందిరను నిలిపింది. ఇందిర స్వయానా రాజయ్య బావమరిది సతీమణే కావడం గమనార్హం.

స్టేషన్ ఘనపూర్ టికెట్ కోసం రేవంత్ రెడ్డి సన్నిహితుడు దొమ్మాటి సాంబయ్య, డాక్టర్ విజయరామారావు పోటీ పడినప్పటికీ, ఇందిరకు ఇస్తేనే రాజయ్యపై గట్టి అభ్యర్థిని నిలిపినట్టు అవుతుందని స్థానిక నేతలు కాంగ్రెస్ అధిష్ఠానానికి సూచించినట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో స్టేషన్ ఘనపూర్ ప్రాంతంలో ఇందిర కుటుంబం ఆర్థికంగా బలమైన కుటుంబం కావడం, అంగబలం పుష్కలంగా ఉండటంతో ఆమెకు అవకాశం దక్కిందని తెలుస్తోంది. ఆమె రాజయ్యకు గట్టి పోటీని ఇస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

TRS
Congress
Rajayya
Indira
Station Ghanapur
  • Loading...

More Telugu News