Biggboss: మళ్లీ కదిలిన కౌశల్ ఆర్మీ... ఈ సారి ప్రజల కోసం!

- శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన కౌశల్
- తిత్లీ బాధితులకు ఆర్థిక సాయం
- ఎంపీ రామ్మోహన్ నాయుడు దంపతులతో భేటీ
తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ సీజన్-2 నడుస్తున్న వేళ కౌశల్ ఆర్మీ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. తమ అభిమాన కంటెస్టెంట్ కౌశల్ ను గెలిపించుకునేందుకు ఆయన సైన్యం బయట ఎన్నో ర్యాలీలు, ప్రదర్శనలు చేసింది. ఇప్పుడు అదే కౌశల్ ఆర్మీ మరోసారి తెరపైకి వచ్చింది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో తిత్లీ తుపాను తరువాత భారీగా నష్టపోయిన బాధితులకు సాయం చేసేందుకు ముందుకు వచ్చింది.
