Konda Surekha: కొండా సురేఖను గెలిపిస్తే.. గూండా రాజకీయం మళ్లీ మొదలవుతుంది: చల్లా ధర్మారెడ్డి

  • పరకాల నియోజకర్గం ప్రస్తుతం ప్రశాంతంగా ఉంది
  • సురేఖ గెలిస్తే.. మళ్లీ అరాచకం మొదలవుతుంది
  • కేసీఆర్ సంక్షేమ కార్యక్రమాలే మమ్మల్ని గెలిపిస్తాయి

కాంగ్రెస్ అభ్యర్థి కొండా సురేఖ, కొండా మురళిలపై టీఆర్ఎస్ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సురేఖను గెలిపిస్తే గూండా రాజకీయం మళ్లీ మొదలవుతుందని ఆయన అన్నారు. పరకాల నియోజకవర్గం ప్రస్తుతం చాలా ప్రశాంతంగా ఉందని... మహాకూటమి పేరుతో ఆమె వస్తున్నారని, ఆమెను గెలిపిస్తే మళ్లీ అరాచకం మొదలవుతుందని చెప్పారు.

మీకు ప్రశాంతమైన రాజకీయం కావాలో, గూండా రాజకీయం కావాలో తేల్చుకోవాలంటూ ఓటర్లను ఉద్దేశిస్తూ అన్నారు. కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ కార్యక్రమాలే తమను గెలిపిస్తాయని చెప్పారు. ఎన్ని పార్టీలు కూటమిగా వచ్చినా, టీఆర్ఎస్ దే విజయమని అన్నారు. పరకాల మండలం కంఠాత్మకూర్ గ్రామంలో ఈరోజు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన ఆయన... ఈ మేరకు వ్యాఖ్యానించారు.

Konda Surekha
konda murali
challa dharma reddy
TRS
congress
mulugu
  • Loading...

More Telugu News