Madhya Pradesh: ఓట్లు అడిగేందుకు వెళ్లి కంగుతున్న మధ్యప్రదేశ్ సీఎం భార్య సాధన!

  • బుద్నీ నుంచి పోటీ పడుతున్న శివరాజ్ సింగ్ 
  • ఓట్లు అడిగేందుకు వెళ్లిన సాధనా సింగ్
  • మంచినీరు లేక చచ్చిపోతున్నామని నిలదీసిన మహిళ

మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌ సింగ్ చౌహాన్ భార్య సాధనా సింగ్ తన భర్తకు ఓటువేయమని కోరుతున్న వేళ, ఓ మహిళ నిలదీయడంతో కంగుతిన్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శివరాజ్‌ సింగ్ మరోమారు బుద్నీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీలో ఉండగా, భర్త విజయం కోసం సాధన ప్రచారం ప్రారంభించారు.

 ఈ క్రమంలో ఒక మహిళా ఓటరు ఆమెను నిలదీసింది. తాగునీటి సమస్య పరిష్కారం కాలేదని గుర్తు చేసింది. ఓట్ల సమయంలో వచ్చి, అన్ని సమస్యలూ నెరవేరుస్తామని హామీలు ఇస్తారని, తమకు చుక్క తాగునీరు అందడం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. తామంతా దాహంతో చచ్చిపోతున్నామని మండిపడింది. అక్కడే ఉన్న ఇతరులంతా ఆ మహిళకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా, ఆమె మాత్రం తగ్గలేదు. ఆ మహిళ వాదనకు సాధన షాక్ తింది. నీటి సమస్యను తప్పకుండా పరిష్కరిస్తామని చెప్పి, ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Madhya Pradesh
Sadhana Singh
Sivaraj Singh Chouhan
  • Error fetching data: Network response was not ok

More Telugu News