Andhra Pradesh: జగన్ 296వ రోజు ప్రజాసంకల్ప యాత్ర.. రూట్ మ్యాప్ విడుదల చేసిన వైసీపీ!

  • విజయనగరం జిల్లా కొయ్యానపేటలో ప్రారంభం
  • పార్వతీపురంలోని తామరఖండిలో జగన్ విశ్రాంతి
  • వివరాలు వెల్లడించిన వైసీపీ నేత తక్షశిల రఘురాం

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ 296వ రోజు ప్రజాసంకల్పయాత్ర విజయనగరం జిల్లాలో ప్రారంభమైంది. ఈ రోజు ఉదయం 7.30 గంటలకు కొయ్యానపేట నుంచి జగన్ తన పాదయాత్రను ప్రారంభించారు. జగన్ ప్రజాసంకల్పయాత్ర కంచేడువలస క్రాస్, వెంకటభైరిపురం పైనుంచి సాగనుంది.

అక్కడ మధ్యాహ్న భోజనం అనంతరం జగన్ పార్వతీపురం నియోజకవర్గంలోని సీతానగరం మండలం బగ్గందొరవలస, గెడ్డలుప్పి జంక్షన్ మీదుగా సాయంత్రం 4.30 గంటలకు జగన్ తామరఖండికి చేరుకుంటుంది. రాత్రికి జగన్ అక్కడే బస చేయనున్నారు. ఈ మేరకు పార్టీ ఏపీ ప్రధాన కార్యదర్శి, వైసీపీ ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ తలశిల రఘురాం ప్రకటనను విడుదల చేశారు. కాగా ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ప్రజల సమస్యలను తెలుసుకుంటూ జగన్ ముందుకు సాగుతున్నారు.

Andhra Pradesh
Jagan
Vijayanagaram District
prajasankalpa yatra
296 day
route map
  • Loading...

More Telugu News