Anant Kumar: చివరి కోరికను తీర్చుకోకుండానే తుది శ్వాస విడిచిన అనంత్ కుమార్!

  • పలు జాతీయ పదవులు, మంత్రిత్వ శాఖలు నిర్వహించిన అనంత్ కుమార్
  • సీఎం కావాలన్న ఆశను తీర్చుకోలేకపోయిన వైనం
  • ఎన్నిసార్లు ప్రయత్నించినా దక్కని చాన్స్

దాదాపు 30 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితాన్ని చవిచూసిన దివంగత కేంద్ర మంత్రి అనంత్ కుమార్, తన చివరి కోరికను మాత్రం తీర్చుకోకుండానే తుది శ్వాస విడిచారు. పార్టీ పరంగా జాతీయ స్థాయి పదవులను, కీలక మంత్రిత్వ శాఖలను నిర్వహించిన ఆయన, సీఎం కావాలన్న ఆశను మాత్రం తీర్చుకోలేకపోయారు. కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ, సీఎం అయ్యేందుకు తన వంతు ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు అనంత్ కుమార్, 1999 నుంచి 2004 మధ్య ముగ్గురు ముఖ్యమంత్రులు మారిన సమయంలో ఆయనకు అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది.

ఇక ఆయన తన చివరి రోజుల్లో స్వస్థలమైన దేవనహళ్ళి సమీపంలోని హెగ్గనహళ్లిలో నివాసం ఉండాలని భావించేవారు. తన బాల్యాన్నంతా హెగ్గనహళ్ళి ప్రాంతంలోనే గడిపిన ఆయన, రాజకీయాల నుంచి తప్పుకున్న తరువాత, ఇదే ప్రాంతంలో ఉంటానని తన సన్నిహితులు, బంధువులతో చెప్పుకునేవారు. ఇలా ఆయన తన రెండు కోరికలను తీర్చుకోకుండానే, క్యాన్సర్ బారిన పడి ఈ లోకాన్ని వీడారు. కాగా, అనంత్ కుమార్ అంత్యక్రియలు నేడు అధికార లాంఛనాలతో జరగనున్నాయి.

Anant Kumar
Karnataka
CM
Last Rites
  • Loading...

More Telugu News