kavacham: ‘కవచం’ సినిమా వేడుకలో అనూహ్య ఘటన.. కాజల్ బుగ్గపై ముద్దిచ్చిన చోటా కె. నాయుడు!

  • ఒక్క క్షణం షాకైన కాజల్
  • తర్వాత నవ్వేసి వాతావరణాన్ని తేలిక పరిచిన నటి
  • తన కుటుంబంలోని వ్యక్తి లాంటి వారన్న కాజల్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా రూపొందుతున్న చిత్రం ‘కవచం’. శ్రీనివాస్ మామిళ్ల ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. సోమవారం ఈ సినిమా టీజర్ విడుదలైంది. సినిమా చిత్రీకరణ పూర్తికాగా, పాటల చిత్రీకరణ మాత్రం ఇంకా మిగిలి ఉంది.

 కాగా, టీజర్ విడుదల సందర్భంగా అనూహ్య ఘటన చోటుచేసుకుంది. కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ.. సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు తనకు ఇష్టమైన వ్యక్తి అని పేర్కొంటూ ఆయనను ‘స్మాల్’ అని సంబోధించింది. ఆయనతో మరోసారి కలిసి పనిచేయడం అద్భుతమైన అనుభూతని పేర్కొంది.

దీంతో ఆనందం పట్టలేని చోటా కె. నాయుడు వెంటనే కాజల్‌ను దగ్గరకు తీసుకుని బుగ్గపై ముద్దు పెట్టాడు. ముందు షాకై తర్వాత తేరుకుని ‘చాన్స్ పే డ్యాన్స్’ అని నవ్వేసింది. ‘స్మాల్ ఇట్స్ ఫైన్. ఆయన నా కుటుంబంలోని ఓ వ్యక్తి లాంటి వారు’’ అని వాతావరణాన్ని తేలికపరిచింది.

kavacham
Movie
Tollywood
Kajal Agarwal
Bellamkonda Sai Sreenivas
chota k naidu
  • Loading...

More Telugu News