keerti: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • 'ఇంకా ఆ సినిమా ప్రభావమే' అంటున్న కీర్తి 
  • కైరా అద్వానీతో చరణ్ చివరి పాట 
  • పిరియాడిక్ సబ్జెక్టుతో నారా రోహిత్

*  'మహానటి' చిత్రం తన జీవితాన్ని ఎంతో మార్చేసిందని చెబుతోంది కథానాయిక కీర్తి సురేశ్. 'అవును, మహానటి నా జీవితాన్ని బాగా మార్చేసింది. అందుకే ఇంతవరకు తెలుగులో పదిహేను కథలు విన్నప్పటికీ ఇంకా ఏదీ ఒప్పుకోలేదు. దీనికి కారణం, మహానటి తర్వాత నా నుంచి వుండే అంచనాలే. వాటిని చేరుకునే కథనే ఎంచుకోవాలి. ప్రస్తుతం ఆ ప్రయత్నంలోనే వున్నాను' అని చెప్పింది.
*  రామ్ చరణ్, బోయపాటి కాంబినేషన్లో రూపొందుతున్న 'వినయ విధేయ రామ' చిత్రం షూటింగుకి సంబంధించి ఇక ఒక పాట చిత్రీకరణ మాత్రం మిగిలివుంది. ఈ పాటను వచ్చే నెలలో చరణ్, కైరా అద్వానీలపై చిత్రీకరిస్తారు.
*  'బాణం' చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన చైతన్య దంతులూరి ఈసారి పిరియాడిక్ సబ్జెక్టును తీసుకున్నాడు. 1971 కాలం నాటి యుద్ధ వాతావరణంలో రూపొందే ఈ చిత్రంలో నారా రోహిత్ హీరోగా నటిస్తాడు.

keerti
charan
Boyapati Sreenu
kaira
Nara Rohit
  • Loading...

More Telugu News