phillipines: విమానంలో ఆకలితో ఏడుస్తున్న చిన్నారికి పాలిచ్చిన అమ్మ కాని అమ్మ!

  • ఫిలిప్పైన్స్ విమానంలో ఆకలితో గుక్కపెట్టిన చిన్నారి
  • ఆ చిన్నారికి పాలుపట్టలేని స్థితిలో తల్లి
  • విమానంలో అందుబాటులో లేని పాలు
  • ఆ చిన్నారికి తానే తల్లి అయి పాలిచ్చిన ఎయిర్ హోస్టెస్

తన బిడ్డ ఆకలితో ఏడుస్తుంటే ఏ అమ్మ మనసూ తల్లడిల్లకుండా ఉండదు. అందుకే, తనకు పుట్టిన బిడ్డ కాకపోయినా ఆ బిడ్డ ఆకలిని చూసి తల్లడిల్లిపోయింది అమ్మ కాని ఆ అమ్మ. ఆకలేసిన చిన్నారికి సమయానికి పాలు దొరకక గుక్క పట్టి ఏడుస్తుంటే ఆ చిన్నారి తల్లి సహా, తోటి ప్రయాణికులందరూ విమానంలో నిస్సహాయంగా ఉన్న సమయంలో ఎయిర్ హోస్టెస్ తన అమ్మ మనసును చాటుకుంది.
 
ఫిలిప్పైన్స్ కు చెందిన పాత్రిశా ఆర్గానో, ఆ దేశ ఎయిర్ లైన్స్ ఫ్లైట్ అటెండెంట్ గా పని చేస్తోంది. విమానం బయలు దేరిన తర్వాత కొంచెం సేపటికి ఓ చిన్నారి ఏడుపు వినిపించడం గమనించింది. వెంటనే, ఆ సీటు దగ్గరకు వెళ్లి చిన్నారి తల్లిని ఈ విషయమై ఆరా తీసింది. ఆకలితో తల్లడిల్లుతున్న చిన్నారికి పాలు పట్టడానికి లేవని తెలుసుకుంది. అయితే, విమానంలో కూడా పాలు అందుబాటులో లేకపోవడంతో ఆ చిన్నారి ఆకలి ఎలా తీర్చాలన్నది పెద్ద సమస్యగా తయారైంది. చిన్నారి, ఆ తల్లి పడుతున్న బాధను అర్థం చేసుకుంది. కారణం, తను కూడా ఓ తొమ్మిది నెలల పాపాయికి తల్లి మరి!  

ఆ చిన్నారికి పాలిస్తానని ఆ తల్లితో చెప్పింది పాత్రిశా. అందుకు, ఆమె అంగీకరించడంతో చిన్నారికి స్తన్యాన్నిచ్చింది. తన బిడ్డ ఆకలి తీరుతుంటే ఆ తల్లి పొందిన ఆనందం వర్ణనాతీతం. ఈ విషయాన్ని పాత్రిశా తన ఫేస్ బుక్ పోస్ట్ లో పేర్కొంది. తన బిడ్డ ఆకలితో ఏడుస్తుంటే తల్లి నిస్సహాయస్థితిలో ఉండటాన్ని మించిన బాధ మరోటి ఉండదని, ఆ బిడ్డ ఆకలి తీర్చిన తనకు చాలా సంతోషంగా ఉందని, అది మాటల్లో చెప్పలేనని పాత్రిశా పేర్కొనడం గమనార్హం.

  • Loading...

More Telugu News