Andhra Pradesh: ఏపీ పోలీస్ శాఖలో కానిస్టేబుళ్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

  • సివిల్, ఏఆర్, ఏపీఎస్సీ, తదితర కేటగిరిలో ఖాళీలు
  • 2,723 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
  • ఏపీ డీజీపీ ఠాకూర్ ప్రకటన

ఏపీ పోలీస్ శాఖలో కానిస్టేబుళ్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ సందర్భంగా ఏపీ డీజీపీ ఠాకూర్ ఓ ప్రకటన చేశారు. సివిల్, ఏఆర్, ఏపీఎస్సీ, ఫైర్ మెన్, వార్డర్స్ కేటగిరీలో ఖాళీగా ఉన్న 2,723 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. నేటి నుంచి డిసెంబర్ 7 వరకు ఆన్ లైన్ ద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

వచ్చే ఏడాది  జనవరి 6న లిఖిత పరీక్ష ఉంటుంది. ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఫిబ్రవరి రెండో వారంలో దేహదారుఢ్య పరీక్ష, మార్చి నెల మొదటి వారంలో తుది లిఖిత పరీక్ష నిర్వహించి, పరీక్షా ఫలితాలు మార్చి నెలాఖరుకు విడుదల చేసేలా ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. అభ్యర్థుల వయోపరిమితి పెంచే విషయమై ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఠాకూర్ స్పష్టం చేశారు.

Andhra Pradesh
police
constables notification
  • Loading...

More Telugu News