Bengalore: అప్పు తీసుకున్న వ్యక్తి మృతి చెందడంతో.. మనస్తాపంతో ఒకే కుటుంబంలోని నలుగురి ఆత్మహత్య

  • ఓ వ్యక్తికి రూ.25 లక్షలు అప్పిచ్చిన జనార్దన్
  • అప్పు తీసుకున్న వ్యక్తి మృతి
  • మనస్తాపంతో కుటుంబం మొత్తం ఆత్మహత్య

ఒకే కుటుంబంలోని నలుగురు ఆత్మహత్యకు పాల్పడటం బెంగళూరులో సంచలనం రేపుతోంది. ఆర్థిక ఇబ్బందులతో తల్లిదండ్రులు, కూతురు, మనవరాలు బలవన్మరణానికి పాల్పడిన హృదయవిదారక ఘటన నగరంలోని విద్యారణ్యపురంలో జరిగింది. జనార్దన్(52) అనే వ్యక్తి ఓ వ్యక్తికి రూ.25 లక్షలు అప్పుగా ఇచ్చాడు.

అప్పు తీసుకున్న వ్యక్తి మృతి చెందడంతో కుటుంబం మొత్తం మనస్తాపానికి గురైంది. దీంతో జనార్దన్, ఆయన భార్య సుమిత్ర(45), కూతురు సుధారాణి(29), మనవరాలు సోనికా(6) ఆత్మహత్య చేసుకున్నారు. సోనికా మాత్రం ముఖానికి ప్లాస్టిక్ కవర్ తొడగడంతో ఊపిరాడక మృతి చెందినట్టు తెలుస్తోంది. ఆర్థిక ఇబ్బందులతోనే తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్టు జనార్దన్ లేఖలో పేర్కొన్నట్టు సమాచారం. 

Bengalore
Sucide
Janardhan
Sudharani
Sonika
  • Loading...

More Telugu News