Yamini Sadhineni: పురందేశ్వరి కామెంట్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ అధికార ప్రతినిధి యామిని

  • రాఫెల్ కుంభకోణంపై స్పందనేంటో చెప్పాలి
  • ఎన్ని నిధులు తీసుకొచ్చారో వెల్లడించాలి
  • అభివృద్ధికి ఖర్చు చేసిన నిధులపై వ్యాఖ్యలు దారుణం

బీజేపీ నేతలు పురందేశ్వరి, జీవీఎల్ నరసింహారావుపై టీడీపీ అధికార ప్రతినిధి యామిని సాధినేని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. రాఫెల్ కుంభకోణంపై సమాధానం చెప్పాలని, అలాగే బీజేపీ నేతలు కేంద్రం నుంచి ఇప్పటి వరకూ ఎన్ని నిధులు తీసుకొచ్చారో చెప్పాలని యామిని డిమాండ్ చేశారు.

పొత్తులపై పురందేశ్వరి చేసిన కామెంట్లపై యామిని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు పురందేశ్వరి ఏ పార్టీ నుంచి వచ్చి ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నారో చెప్పాలంటూ ధ్వజమెత్తారు. ఇక  జీవీఎల్ గురించి యామిని మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం కోసం కేంద్రం రూ.3 వేల కోట్లు ఖర్చు చేస్తే మాట్లాడని జీవీఎల్.. ఏపీ అభివృద్ధికి ఖర్చు చేసిన నిధులపై వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు.

Yamini Sadhineni
Purandheswari
BJP
GVL Narasimha Rao
Patel
  • Loading...

More Telugu News