t-Telugudesam: టీవీ ఛానెళ్లలో వస్తున్న అభ్యర్థుల జాబితా అవాస్తవం: టీ-టీడీపీ నేత ఎల్. రమణ

  • టీడీపీ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించలేదు
  • కూటమిలోని పార్టీలు పోటీ చేసే స్థానాలు తేలాలి
  • ఆ తర్వాతే అభ్యర్థుల ప్రకటన ఉంటుంది

టీడీపీ తరపున అభ్యర్థులను ఇంకా అధికారికంగా ప్రకటించలేదని, టీవీ ఛానెళ్లలో వస్తున్న అభ్యర్థుల జాబితా అవాస్తవమని టీ-టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ స్పష్టం చేశారు. హైదరాబాద్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, మహాకూటమిలోని పార్టీలు ఎక్కడి నుంచి పోటీ చేస్తాయనే విషయాన్ని అధికారికంగా వెల్లడిస్తామని, పార్టీలు పోటీ చేసే స్థానాలు తేలిన తర్వాతే అభ్యర్థుల ప్రకటన ఉంటుందని చెప్పారు. కాగా, మహాకూటమిలో టీడీపీకి కేటాయించిన స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ఈరోజు ప్రకటిస్తారంటూ ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ఆశావహులు, పార్టీ అభిమానులు ఎదురుచూపులు చూశారు. 

t-Telugudesam
ramana
mahakutami
  • Loading...

More Telugu News