narayana swamy: ఎంపీ కేసీఆర్ కు, సీఎం కేసీఆర్ కు మధ్య చాలా తేడా వచ్చింది: పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి

  • నాలుగున్నరేళ్లుగా కేవలం ప్రగతి భవన్ కే పరిమితమయ్యారు
  • ఇలా అయితే ప్రజల ఆకాంక్షలను ఎలా నెరవేరుస్తారు?
  • రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలన కొనసాగుతోంది

గతంలో ఎంపీగా ఉన్న కేసీఆర్ కు, ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ కు మధ్య చాలా తేడా వచ్చిందని పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి విమర్శించారు. నాలుగున్నరేళ్ల పాలనలో ఆయన కేవలం ప్రగతి భవన్ కే పరిమితమయ్యారని అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు కూడా ఆయన అందుబాటులో లేకుండా ఉన్నారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి ఎవర్నీ కలవకపోతే అధికారులు, రైతులు, మత్స్యకారులు, దళితులు, ఆదివాసీలు తదితరుల సమస్యలను ఎలా తీరుస్తారని ప్రశ్నించారు. హైదరాబాదుకు వచ్చిన ఆయన... గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

తాను, కేసీఆర్ ఇద్దరం ఒకేసారి లోక్ సభలో ఉన్నామని... అప్పటికీ, ఇప్పటికీ ఆయనలో చాలా మార్పు వచ్చిందని ఈ సందర్భంగా నారాయణస్వామి అన్నారు. ఎవరినీ కలవకుండా కుటుంబపాలనను కేసీఆర్ నిర్వహిస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబపాలన నడుస్తోందని విమర్శించారు. ప్రజల ఆకాంక్షలు కేసీఆర్ వరకు వెళ్లడం లేదని... ప్రజలతో మమేకం కాకపోతే వారి సమస్యలను కేసీఆర్ ఎలా తీరుస్తారని ప్రశ్నించారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News