sharvanand: ఆకట్టుకుంటోన్న 'పడి పడి లేచె మనసు' టైటిల్ సాంగ్

  • మరోప్రేమకథగా 'పడిపడి లేచె మనసు'
  • సంగీత దర్శకుడిగా విశాల్ చంద్రశేఖర్ 
  • డిసెంబర్ 21వ తేదీన విడుదల

శర్వానంద్ .. సాయిపల్లవి జంటగా 'పడి పడి లేచె మనసు' సినిమా రూపొందింది. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాను డిసెంబర్ 21వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు.

"పద పద పద పదమని పెదవులిలా పరిగెడితే .. పరి పరి పరివిధముల మది వలదని వారిస్తే .. పెరుగుతుందే మది కాయసం .. పెదవడుగుతుందే చెలి సావాసం .." అంటూ ఈ టైటిల్ సాంగ్ సాగుతోంది. నాయకా నాయికల మధ్య ప్రేమభావనలను అందంగా ఆవిష్కరించే పాట ఇది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం .. కృష్ణకాంత్ సాహిత్యం ఆకట్టుకునేలా వున్నాయి. శర్వానంద్ .. సాయిపల్లవి ఇద్దరూ కూడా కొత్తదనానికి ప్రాధాన్యతను ఇచ్చేవారే. అందువలన ఈ సినిమాపై అంచనాలు బాగానే వున్నాయి.

  • Error fetching data: Network response was not ok

More Telugu News