sensex: మరింత పతనమైన రూపాయి.. భారీ నష్టాలను మూటగట్టుకున్న మార్కెట్లు
- డాలరు మారకంతో రూ. 73 కంటే దిగువకు పడిపోయిన రూపాయి విలువ
- క్రూడ్ ఆయిల్ సరఫరాను తగ్గిస్తామన్న సౌదీ అరేబియా
- 345 పాయింట్లు పతనమైన సెన్సెక్స్
భారతీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని భారీ నష్టాలతో ప్రారంభించాయి. డాలరు మారకంతో పోలిస్తే రూపాయి విలువ రూ. 73 కంటే తక్కువకు పడిపోవడం మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది. ముఖ్యంగా ఐటీ సంస్థలు ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. దీనికి తోడు, క్రూడాయిల్ సరఫరాను తగ్గిస్తామంటూ సౌదీ అరేబియా చేసిన ప్రకటనతో... క్రూడ్ ధరలు దాదాపు ఒకటిన్నర శాతం పెరిగాయి. దీని ప్రభావం కూడా మార్కెట్లపై పడింది. ఈ నేపథ్యంలో, ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ ఏకంగా 345 పాయింట్లు నష్టపోయి 34,812కి పడిపోయింది. నిఫ్టీ 103 పాయింట్లు నష్టపోయి 10,482కి దిగజారింది.
టాప్ గెయినర్స్:
వోక్ హార్డ్ (9.02%), బలరాంపూర్ చీనీ మిల్స్ (7.90%), టైటాన్ (5.28%), క్వాలిటీ (4.92%), వరుణ్ బెవరేజెస్ (4.39%).
టాప్ లూజర్స్:
అవంతి ఫీడ్స్ (-11.25%), ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (-8.63%), హిందుస్థాన్ పెట్రోలియం (-6.23%), ఇండియా సిమెంట్స్ (-6.13%), జెట్ ఎయిర్ వేస్ (-5.96%). టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రాలు 0.5 శాతం నుంచి 2.4 శాతం వరకు నష్టపోయాయి.