karthikeya: కార్తికేయ సరసన ఇద్దరు కొత్త హీరోయిన్లు

- కార్తికేయ హీరోగా 'హిప్పీ'
- తెలుగు .. తమిళ భాషల్లో చిత్రీకరణ
- నిర్మాతగా కలైపులి థాను
'ఆర్ ఎక్స్ 100' సినిమాతో హీరో కార్తికేయ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ సినిమా తరువాత ఆయన తెలుగు .. తమిళ భాషల్లో 'హిప్పీ'అనే ఒక సినిమా చేస్తున్నాడు. కలైపులి థాను నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాకి టి.ఎన్.కృష్ణ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాలో కథ ప్రకారం ఇద్దరు కథానాయికలు అవసరమట.
