Andhra Pradesh: ఏపీ విద్యుత్ ఉద్యోగులను అభినందించిన మంత్రి కళావెంకట్రావు

  • తిత్లీ సహాయకచర్యల్లో పాల్గొన్న ఉద్యోగులకు అభినందన
  • అధికారులు వేగంగా పని చేయడంతో  విద్యుత్ పునరుద్ధరణ
  • ముందస్తు అప్రమత్తతతో ఎక్కువ నష్టం లేదు

తిత్లీ సహాయకచర్యల్లో పాల్గొన్న విద్యుత్ శాఖ ఉద్యోగులను ఏపీ మంత్రి కళావెంకట్రావు అభినందించారు. ఈ సందర్భంగా విజయవాడలోని విద్యుత్ సౌధాలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తిత్లీ తుపాన్ బాధితులకు సాయం కింద రూ.7.20 కోట్లను విద్యుత్ ఉద్యోగులు అందజేశారు.

ఈ సందర్భంగా కళావెంకట్రావు మాట్లాడుతూ, అధికారులు వేగంగా పనిచేయడం వల్లే త్వరితగతిన విద్యుత్ పునరుద్ధరణ జరిగిందని అన్నారు. ముందస్తు అప్రమత్తతతో ప్రాణ, ఆస్తి నష్టం ఎక్కువ లేకుండా నివారించగలిగామని చెప్పారు. 'గజ' తుపాన్ తీరాన్ని తాకే ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని, నాయుడుపేట, తడ, గూడూరు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు కళా వెంకట్రావు సూచించారు.

Andhra Pradesh
electricity employes
minister kala
  • Loading...

More Telugu News