TRS: టీఆర్ఎస్ భవన్ వద్ద మన్నె గోవర్ధన్ రెడ్డి అనుచరుల ఆందోళన

  • ఖైరతాబాద్ టీఆర్ఎస్ టికెట్ కోసం తీవ్ర పోటీ
  • టికెట్ ఆశిస్తున్న దానం, మన్నె, విజయారెడ్డి
  • టికెట్ మాకే ఇవ్వాలంటూ మన్నె అనుచరుల ఆందోళన

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పర్వం కూడా మొదలైంది. ఈ నేపథ్యంలో, వివిధ పార్టీల్లో టికెట్లను ఆశిస్తున్న ఆశావహులు తమ తుది ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఖైరతాబాద్ టికెట్ ను తమ నేత మన్నె గోవర్ధన్ కే కేటాయించాలని డిమాండ్ చేస్తూ... ఆయన అనుచరులు టీఆర్ఎస్ భవన్ వద్ద ఆందోళనకు దిగారు. గేటు ముందు బైఠాయించి నినాదాలు చేశారు. మన్నె గోవర్ధన్ రెడ్డి ఖైరతాబాద్ టీఆర్ఎస్ ఇన్ ఛార్జ్ గా కూడా ఉన్నారు.

ఇటీవలే కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిన మాజీ మంత్రి దానం నాగేందర్ కు టీఆర్ఎస్ టికెట్ దాదాపు ఖరారైంది. ఈ నేపథ్యంలో, దానంకు టికెట్ ఇవ్వరాదని మన్నె అనుచరులు డిమాండ్ చేశారు. ఖైరతాబాద్ టీఆర్ఎస్ టికెట్ కోసం తీవ్ర పోటీ నెలకొంది. దానం నాగేందర్, మన్నె గోవర్దన్ రెడ్డిలతో పాటు పీజేఆర్ కుమార్తె విజయారెడ్డిలు టికెట్ ను ఆశిస్తున్నారు. అయితే, కేసీఆర్ దానంవైపే మొగ్గుచూపుతున్నట్టు సమాచారం.

TRS
khairathabad
ticket
manne govardhan reddy
danam nagender
vijaya reddy
  • Loading...

More Telugu News