Anantapur District: మళ్లీ చంద్రబాబు సీఎం అయితేనే రాష్ట్రం అభివృద్ధి : జేసీ ప్రభాకర్‌రెడ్డి

  • బాబును గెలిపించుకోవడం మనందరికీ తప్పనిసరి
  • తాడిపత్రి ప్రజలకు రుణపడి ఉంటాం
  • నలభై ఏళ్లుగా మా కుటుంబాన్ని ఆదరిస్తున్న వారికి కృతజ్ఞతలు

చంద్రబాబునాయుడు మరోసారి కాదు, మరో ఇరవై ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉంటేనే ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి సాధ్యమవుతుందని, అందువల్ల మనందరం కలిసికట్టుగా ఆయనను గెలిపించుకోవలసిన అవసరం ఉందని ఎమ్మెల్యే జె.సి.ప్రభాకర్‌రెడ్డి అన్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రి మండల కేంద్రంలో ఆదివారం జరిగిన ఓ సామాజిక వర్గం ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ నలభై ఏళ్లుగా తమ కుటుంబాన్ని గుండెల్లో పెట్టి చూసుకుంటున్న తాడిపత్రి ప్రజలకు శతకోటి వందనాలని, వారందరికీ తామెంతో రుణపడి ఉంటామని అన్నారు. తమ వల్ల  ఎవరైనా నొచ్చుకుని ఉంటే క్షమాపణలు చెబుతున్నానని, అదే సమయంలో ఎవరైనా తప్పు చేసి ఉంటే వారిని మనస్ఫూర్తిగా క్షమించి అక్కున చేర్చుకుంటానని తెలిపారు.

రాజకీయాలంటే తనకు పెద్దగా ఇష్టం లేదని, రానున్న ఎన్నికల్లో తన కొడుకు జె.సి.అశ్మిత్‌రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారని వెల్లడించారు. తాడిపత్రి ప్రజల రుణం తీర్చుకునేందుకు రానున్న ఎన్నికల్లో మున్సిపల్‌ కౌన్సిలర్‌గా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

Anantapur District
tadipatri
jcprabhakar reddy
  • Loading...

More Telugu News