tpcc: తెలంగాణ నేతలపై సీరియస్ అయిన రాహుల్ గాంధీ!
- నామినేషన్ల ప్రక్రియ మొదలైనా.. అభ్యర్థులను ప్రకటించకపోవడంపై ఆగ్రహం
- వెంటనే అభ్యర్థులను ప్రకటించాలంటూ ఆదేశం
- ఈరోజు రాహుల్ ను కలిసిన టీకాంగ్రెస్ నేతలు
తెలంగాణ కాంగ్రెస్ నేతలపై ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీ సీరియస్ అయ్యారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ మొదలైనా... ఇంకా, అభ్యర్థులను ఖరారు చేయకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పలువురు సీనియర్ నేతలు ఈరోజు ఢిల్లీలో రాహుల్ తో భేటీ అయ్యారు.
మహాకూటమి పొత్తులకు సంబంధించిన చర్చల వివరాలను ఆయనకు వివరించారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనా... పొత్తుల వ్యవహారాన్ని ఇంకా తేల్చకపోవడంపై ఈ సందర్భంగా రాహుల్ అసహనం వ్యక్తం చేశారు. వెంటనే అభ్యర్థులను ప్రకటించాలని ఆదేశించారు.