Deepika Padukone: కత్రినా కైఫ్ ను తన పెళ్లికి పిలవని దీపికా పదుకొనే!

  • 14, 15 తేదీల్లో దీపిక వివాహం
  • ఇటలీలో వైభవంగా జరగనున్న వేడుక
  • కత్రినాకు అందని శుభలేఖ

బాలీవుడ్ సెలబ్రిటీ జంట రణవీర్‌ సింగ్, దీపిక పదుకొనెల పెళ్లి, ఈ నెల 14, 15 తేదీలలో ఇటలీలో వైభవంగా జరుగనుండగా, వీరి వివాహానికి వెళ్లే గెస్టుల లిస్టు ఇప్పుడు చర్చనీయాంశమైంది. వీరిద్దరికీ సన్నిహితులైన పలువురు సెలబ్రిటీలు ఇప్పటికే ఇటలీ చేరుకోగా, మరింతమంది నేడు బయలుదేరి వెళుతున్నారు.

అయితే, ఈ వివాహానికి అందాల భామ కత్రినా కైఫ్ కు మాత్రం ఆహ్వానం అందలేదట. గతంలో కత్రినా, రణవీర్ మధ్య నడిచిన అనుబంధం గురించి అందరికీ తెలిసిందే. ఇటీవల 'కాఫీ విత్ కరణ్'లో కత్రిన మాట్లాడుతూ, దీపిక, రణవీర్‌ ల పెళ్లి కార్డు అందుకునేందుకు ఎదురు చూస్తున్నానని, ఈ వివాహ వేడుకలో భాగం కావాలని ఉందని చెప్పింది.

 అయితే, ఆమెకు ఇంతవరకూ శుభలేఖ అందలేదు. కత్రినా ఎక్స్‌ బాయ్ ఫ్రెండ్ గా రణబీర్‌ కపూర్‌ ఉండటం, అతనికి కొంతకాలం దీపిక గర్ల్‌ ఫ్రెండ్‌ గా ఉండటం అందరికీ తెలిసిందే. దీంతో కత్రిన, దీపికల మధ్య గొడవలు జరిగాయని కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆమెను పెళ్లికి ఆహ్వానించలేదని తెలుస్తోంది.

Deepika Padukone
Katrina Kaif
Ranveer Singh
Marriage
Italy
  • Loading...

More Telugu News