chattisgarh: చత్తీస్‌గఢ్‌లో కొనసాగుతున్న మావోయిస్టుల హింస... మళ్లీ బాంబు దాడి

  • పోలింగ్‌ ప్రారంభానికి కొన్ని గంటల ముందు ఘటన
  • దంతెవాడ జిల్లాలోని తమక్‌పాల్‌-నయనార్‌ రోడ్డులో ఘటన
  • భద్రతా సిబ్బంది, పోలింగ్‌ అధికారులు క్షేమం

ఎన్నికలు జరుగుతున్న చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల హింస కొనసాగుతూనే ఉంది. ఆదివారం కాంకేర్‌ జిల్లాలో మావోయిస్టులు ఐఈడీని పేల్చిన ఘటనలో ఒక ఎస్‌ఐ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. సోమవారం పోలింగ్‌కు కొన్ని గంటల ముందు  మావోయిస్టులు మరో ఘటనకు పాల్పడ్డారు. రాష్ట్రంలో సోమవారం తొలిదశ పోలింగ్‌ జరుగుతున్న విషయం తెలిసిందే.

 దంతెవాడ జిల్లాలోని తమక్‌పాల్‌-నయనార్‌ రోడ్డులో ఉదయం 5.30 గంటల ప్రాంతంలో నక్సల్స్‌ ఐఈడీని పేల్చేశారు. పోలింగ్‌ విధుల నిర్వహణకు వెళ్తున్న భద్రతా సిబ్బంది, ఎన్నికల అధికారులను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. అయితే ఎవరికీ ఏమీ కాలేదు. ‘పోలింగ్‌ సిబ్బంది, భద్రతా సిబ్బంది క్షేమంగా పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నారు’ అని ఉన్నతాధికారులు తెలిపారు.

chattisgarh
maoists
bomb blast
  • Loading...

More Telugu News