Eenadu: 'ఈనాడు' దినపత్రిక ధర పెంపు!
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-4ef1e4c27e8fde7b07ee843d4bc1362887af0ae7.jpg)
- పెరిగిన ఉత్పత్తి వ్యయం
- ఇకపై ఆదివారం నాడు రూ. 8
- మిగతా రోజుల్లో రూ. 6.50
'ఈనాడు' దినపత్రిక ధరను పెంచుతున్నట్టు పత్రిక యాజమాన్యం నేడు ప్రకటించింది. ప్రకటించిన ధరలు మంగళవారం నుంచి అమలులోకి వస్తాయని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పేర్కొన్నారు. ఇకపై సోమవారం నుంచి శనివారం వరకూ రూ. 6.50, ఆదివారం నాడు రూ. 8గా ధర ఉంటుందని తెలిపారు.
పత్రిక ముద్రణకు అవసరమైన న్యూస్ ప్రింట్ ఇతర ముడి సరుకుల ధరలు అసాధారణంగా పెరిగాయని గుర్తు చేసిన యాజమాన్యం, పెట్రోలు, డీజిల్ ఖర్చులు పెరిగాయని, డాలర్ తో రూపాయి మారకపు విలువ పడిపోవడం కూడా తమపై ప్రభావం చూపిందని అన్నారు. ఈ నేపథ్యంలోనే ధరను పెంచక తప్పడం లేదని, పాఠకులు సహృదయంతో అర్థం చేసుకోవాలని కోరారు.