Jagan: 17 రోజుల తరువాత... మేలపువలసకు జగన్!

  • నిన్న సాయంత్రం విశాఖకు చేరుకున్న జగన్
  • ఆపై రోడ్డు మార్గాన మేలపువలసకు
  • నేడు కొయ్యానపేట వరకూ 295వ రోజు పాదయాత్ర

సరిగ్గా 17 రోజుల క్రితం మేలపువలసలో పాదయాత్రకు ఒకరోజు విరామం ఇచ్చి హైదరాబాద్ బయలుదేరిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ పై విశాఖ ఎయిర్ పోర్టులో హత్యాయత్నం జరుగగా, ఆపై చికిత్స పొంది, విశ్రాంతి తీసుకున్న అనంతరం తిరిగి ఆయన నేటి నుంచి పాదయాత్రను ప్రారంభించనున్నారు.

నిన్న సాయంత్రం విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్న జగన్, రోడ్డుమార్గాన మేలపువలసకు వచ్చారు. ఈ ఉదయం అక్కడి నుంచి 295వ రోజు యాత్రను ప్రారంభించి మక్కువ క్రాస్, కాశీపట్నం క్రాస్, పాపయ్యవలస మీదుగా కొయ్యానపేట వరకూ నడిచి, రాత్రికి అక్కడే విశ్రమించనున్నారు. హత్యాయత్నం నేపథ్యంలో జగన్ కు పోలీసులు మూడంచెల భద్రతను కల్పించారు. ముందస్తు అనుమతిలేనిదే రోప్ పార్టీ వలయం దాటి లోపలికి ఒక్కరిని కూడా అనుమతించబోమని, లోపలికి వచ్చేవారిని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తామని తెలిపారు. 

Jagan
Padayatra
Airport
Vizag
  • Loading...

More Telugu News