Congress: ముఖ్యమంత్రిని అవుతా.. కానీ అలా మాత్రం పిలవొద్దు : కార్యకర్తలను కోరిన యడ్యూరప్ప

  • కాంగ్రెస్-జేడీఎస్ నేతలు రోడ్డుకెక్కడం ఖాయం
  • ముఖ్యమంత్రి పదవిపై ఆశ చావలేదు
  • ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమికి నాదే బాధ్యత

తనను కాబోయే ముఖ్యమంత్రిగా పిలవడాన్ని మానుకోవాలని మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప అభిమానులు, కార్యకర్తలను కోరారు. అంతమాత్రాన ముఖ్యమంత్రి కావాలన్న ఆశ లేకుండా పోలేదని స్పష్టం చేశారు. ప్రతి సమావేశంలోనూ తనను కాబోయే ముఖ్యమంత్రిగా అభిమానులు, కార్యకర్తలు పిలవడం ఇబ్బందిగా అనిపిస్తుండడంతో ఆయనీ వ్యాఖ్యలు చేశారు.

ప్రతిపక్ష నేత హోదాను సమర్థంగా నిర్వహిస్తానని చెప్పిన యడ్డీ.. సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేయబోమన్నారు. అయితే, సమన్వయ లేమితో, అంతర్గత కలహాలతో ప్రభుత్వాన్ని వారే కూల్చుకునే పరిస్థితి వస్తుందని జోస్యం చెప్పారు. అంతర్గత విభేదాలతో కాంగ్రెస్-జేడీఎస్ నేతలు రోడ్డుకెక్కడం ఖాయమన్నారు. ఇటీవలి ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమికి తానే బాధ్యత వహిస్తున్నట్టు యడ్యూరప్ప చెప్పారు.

Congress
JDS
BJP
Yeddyurappa
  • Loading...

More Telugu News