Ananth kumar: కేంద్రమంత్రి అనంత్ కుమార్ మృతిపై రాష్ట్రపతి దిగ్భ్రాంతి

  • ఆయన మృతి తీరని లోటు
  • కర్ణాటక ప్రజలకు మరింత విషాదం
  • మంత్రి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి

పార్లమెంటరీ వ్యవహారాల శాఖా మంత్రి హెచ్ఎన్. అనంత్‌కుమార్ మృతిపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి తీరని లోటని, ముఖ్యంగా కర్ణాటక ప్రజలకు ఆయన మరణం తీవ్ర ఆవేదన కలిగించిందని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నట్టు పేర్కొన్నారు.

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అనంత్‌కుమార్ ఈ తెల్లవారుజామున మృతి చెందారు. ఎంపీగా ఎన్నికైన తొలిసారే కేంద్రమంత్రిగా పనిచేసిన ఆయన వరుసగా ఆరుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ, పరిస్థితి విషమించడంతో ఆయన మృతి చెందారు.

Ananth kumar
Union minister
President Of India
Ram Nath Kovind
  • Loading...

More Telugu News