Abids: అబిడ్స్‌లోని ప్రముఖ వ్యాపారి ఇంట్లో భారీ చోరీ

  • రూ.70 లక్షల విలువైన ఆభరణాల అపహరణ
  • రూ.29 లక్షల నగదు చోరీ
  • పనిమనుషులే చోరీకి పాల్పడినట్టు అనుమానం

హైదరాబాద్‌లోని అబిడ్స్‌లో జరిగిన భారీ చోరీ సంచలనం రేకెత్తిస్తోంది. పోలీసుల కథనం ప్రకారం, అబిడ్స్‌లోని ఫతేసుల్తాన్‌లేన్‌లోని ప్రముఖ వ్యాపారి సునీల్ కుమార్ అగర్వాల్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఓ శుభకార్యానికి వెళ్లారు. ఆదివారం తిరిగి ఇంటికి వెళ్లి చూసేసరికి ఇంట్లో చోరి జరిగినట్టు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారమందించారు. విచారణ ప్రారంభించిన పోలీసులు సునీల్ కుమార్ ఇంట్లోని పనిమనుషులు వికాస్, ఆయన భార్య మాయ చోరీకి పాల్పడినట్టు అనుమానిస్తున్నారు. వీరిద్దరిదీ నేపాల్. ప్రస్తుతం వీరు పరారీలో ఉన్నారు. దాదాపు రూ.70 లక్షల విలువైన ఆభరణాలు, రూ.29 లక్షల నగదు దోచుకెళ్లినట్టు పోలీసులకు సునీల్ కుమార్ తెలిపారు.

Abids
Sunil kumar
Maya
Vikas
Nepal
  • Loading...

More Telugu News