RRR: సందడి చేసిన చిరంజీవి, ప్రభాస్, రానా... 'RRR' మొదలైపోయింది!

  • 'RRR' చిత్రీకరణ ప్రారంభం
  • హాజరైన పలువురు సినీ ప్రముఖులు
  • బౌండెడ్ స్క్రిప్టును అందించిన రాఘవేంద్రరావు

దర్శక దిగ్గజం రాజమౌళి తాజా చిత్రం షూటింగ్ టాలీవుడ్ సినీ ప్రముఖుల సందడి మధ్య ప్రారంభమైంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు నటిస్తున్న ఈ మల్టీ స్టారర్ చిత్రం షూటింగ్ ప్రారంభోత్సవానికి పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు.

చిరంజీవి, రాఘవేంద్రరావు, దగ్గుబాటి సురేష్, అల్లు అరవింద్, శ్యామ్ ప్రసాద్, వీవీ వినాయక్, ప్రభాస్, రానా, కీరవాణి తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. చిరంజీవి, ప్రభాస్ తదితరులు పూజా కార్యక్రమాల్లో పాలు పంచుకుని సినిమా బాగా రావాలని శుభాభినందనలు తెలిపారు. ఉదయం 11 గంటల సమయంలో పూజ జరుగగా, అనంతరం బౌండెడ్ స్క్రిప్ట్ ను దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు అందించారు.



RRR
Shooting
Tollywood
Chiranjeevi
Rajamouli
Ramcharan
Prabhas
NTR
  • Loading...

More Telugu News