Tamilnadu: హీరో విజయ్ ను తిట్టిన అన్నాడీఎంకే నేతలు.. ప్రభుత్వం ఇచ్చిన వస్తువులను తగలబెడుతున్న అభిమానులు!

  • ముదిరిన సర్కార్ వివాదం
  • విజయ్ అభిమానుల ఆగ్రహం
  • టీవీలు, మిక్సీలు, సైకిళ్ల దహనం

ఇళయ దళపతి విజయ్, కీర్తి సురేశ్ జంటగా ఏఆర్ మురుగదాస్ తెరకెక్కించిన ‘సర్కార్’ సినిమా వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. తమిళనాడు సీఎం దివంగత జయలలితను, ఆమె పథకాలను తప్పుపట్టేలా ఉన్న సీన్లను తొలగించాలని అన్నాడీఎంకే నేతలు, మంత్రులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పలుచోట్ల థియేటర్ల వద్ద ప్లెక్సీలను చించేశారు. ఈ సందర్భంగా కొందరు అన్నాడీఎంకే నేతలు విజయ్ ను లక్ష్యంగా చేసుకుని దూషణలకు దిగారు.

ఈ నేపథ్యంలో అధికార అన్నాడీఎంకే నేతలపై విజయ్ ఫ్యాన్స్ తీవ్రంగా మండిపడుతున్నారు. సినిమాలో ప్రభుత్వం ఇచ్చిన మిక్సీని హీరో తగులబెట్టే స్ఫూర్తితో చాలామంది అభిమానులు మిక్సీలు, గ్రైండర్లు, టీవీలను అగ్నికి ఆహుతి చేస్తున్నారు. ఈ వీడియోను తీసి సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తున్నారు.

కాగా, ఈ గొడవ నేపథ్యంలో మద్రాస్ హైకోర్టును ఆశ్రయించిన దర్శకుడు ఏఆర్ మురుగదాస్ తనను పోలీసులు అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. మరోవైపు సినిమాలో అభ్యంతకరమైన సీన్లను తొలగించేందుకు నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ అంగీకరించింది.

Tamilnadu
AIADMK
leaders
criticise
hero vijay
sarkar movie
angry
vijay fans
burning
tourch
free schemes
cycle
mixies
tv
table fans
  • Error fetching data: Network response was not ok

More Telugu News