Gali Janardhan Reddy: రాత్రి బాగా నిద్రపట్టిందా? అంటూ గాలిని ప్రశ్నిస్తూ ఈ ఉదయాన్నే విచారణ ప్రారంభించిన అధికారులు!

  • నిన్న పోలీసులకు లొంగిపోయిన గాలి
  • రాత్రి 2 గంటల వరకూ విచారణ
  • ఆపై సీసీబీ కార్యాలయంలోనే నిద్ర
  • నేడు విచారిస్తున్న ఏసీపీ వెంకటేష్ ప్రసన్న

పోంజీ స్కామ్ లో వరుసగా రెండో రోజు కూడా గాలి జనార్దన్ రెడ్డిని సీసీబీ పోలీసులు విచారిస్తున్నారు. మూడు రోజుల అదృశ్యం అనంతరం నిన్న ఆయన పోలీసులకు లోంగిపోగా, సాయంత్రం నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకూ ఆయన్ను విచారించిన అధికారులు, ఈ ఉదయాన్నే తిరిగి ప్రశ్నించడం ప్రారంభించారు.

గత రాత్రి ఆయన్ను అక్కడే ఉంచిన అధికారులు, ఓ దుప్పటి, కొన్ని దుస్తులు, భోజనాన్ని అందించారు. ఆపై ఆయన క్రైమ్ బ్రాంచ్ కార్యాలయం వెయిటింగ్ రూములో నిద్రపోయారు. ఈ ఉదయం గాలిని విచారించేందుకు వచ్చిన ఏసీపీ వెంకటేష్ ప్రసన్న, 'రాత్రి బాగా నిద్రపట్టిందా?' అని ప్రశ్నించారు. కాగా, నేడు గాలి అరెస్ట్ ను చూపించి, ఆయన్ను కోర్టుకు తరలించే అవకాశాలు ఉన్నట్టు పోలీసు వర్గాలు అంటున్నాయి.

Gali Janardhan Reddy
Karnataka
Pongi Scam
CCB
Police
  • Loading...

More Telugu News