Andhra Pradesh: విశాఖలో మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్ పై ఏసీబీ దాడులు.. భారీగా నగదు, బంగారం స్వాధీనం!

  • కోటిన్నర విలువైన భూపత్రాలు జప్తు
  • విశాఖపట్నంలో కొనసాగుతున్న తనిఖీలు
  • కారు డ్రైవర్, మెకానిక్ ఇళ్లలో నగదు స్వాధీనం

విశాఖపట్నంలో మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్ గా పనిచేస్తున్న వెంకట్రావు ఇంటిపై ఈ రోజు అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న వ్యవహారంలో వెంకట్రావుతో పాటు ఆయన బంధువులు, పనిమనుషుల ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా వెంకట్రావుకు సన్నిహితుడైన మెకానిక్ ఇంట్లో దాచిన రూ.11.5 లక్షల నగదు, 2.25 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ఈ దాడుల్లో దాదాపు రూ.1.2 కోట్ల విలువైన భూ డాక్యుమెంట్లను అధికారులకు లభ్యమయ్యాయి. అలాగే మేనల్లుడు సురేశ్ ఇంట్లో మరో రూ.4.5 లక్షలను అధికారులు జప్తు చేశారు. దీంతోపాటు కారు డ్రైవర్ ఇంటి నుంచి మరో రూ.3.40 లక్షలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాగా వెంకట్రావుతో పాటు ఆయన బంధువుల ఇళ్లలో ఏసీబీ దాడులు ఇంకా కొనసాగుతున్నాయి

Andhra Pradesh
Visakhapatnam District
MVI
ACB
raids
gold
cash
seize
land documents
  • Loading...

More Telugu News