Hyderabad: రేపటి నుంచి హైదరాబాద్‌ మహానగరంలో 144 సెక్షన్‌ అమలు

  • సోమవారం నుంచి ప్రారంభంకానున్న ముందస్తు ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ
  • భద్రతా చర్యల్లో భాగంగా ఆంక్షలు అమలు చేస్తున్నట్లు సీపీ వెల్లడి
  • ఈనెల 22వ తేదీ వరకు అమల్లో ఉంటాయని స్పష్టీకరణ

తెలంగాణ రాష్ట్రం ఎన్నికల నామినేషన్‌ ప్రక్రియ ప్రారంభం కానుండడంతో పోలీసులు అలర్టయ్యారు. సోమవారం నుంచి మహానగరంలో 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ ప్రకటించారు. శాంతిభద్రత పరిరక్షణకు ముందస్తు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. నగర పరిధిలో మొత్తం 15 నియోజకవర్గాలున్నాయి. వీటికి సంబంధించిన అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభంకానున్నందున ఆయా రిటర్నింగ్‌ ఆఫీసర్‌ కేంద్రాలకు వంద మీటర్ల పరిధిలో ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. ఈనెల 22వ తేదీతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుంది. అప్పటి వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని సీపీ స్పష్టం చేశారు.

Hyderabad
144 section
election activities
  • Loading...

More Telugu News