Alipiri: 'దేవుడు గొప్పవాడు బాబూ' అని నాడు వైఎస్ పరామర్శించలేదా? నేడు నీకేమైంది? చంద్రబాబుకు విజయమ్మ సూటి ప్రశ్న

  • గతంలో అలిపిరిలో చంద్రబాబుపై హత్యాయత్నం
  • ఆ వెంటనే వెళ్లి పరామర్శించిన వైఎస్ రాజశేఖరరెడ్డి
  • గుర్తు చేసుకుంటూ చంద్రబాబుకు విజయమ్మ ప్రశ్నలు

అలిపిరిలో చంద్రబాబునాయుడిపై హత్యా ప్రయత్నం జరిగిన వేళ, తన భర్త వైఎస్ రాజశేఖరరెడ్డి స్వయంగా వెళ్లి, చంద్రబాబును ఓదార్చాడని గుర్తు చేసుకున్న వైఎస్ విజయమ్మ, నేడు అదే పనిని చంద్రబాబు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. అప్పట్లో ఆసుపత్రిలో ఉన్న చంద్రబాబు వద్దకు వెళ్లి, కౌగిలించుకుని "దేవుడు గొప్పవాడు బాబూ... దేవుడి దయవల్ల రక్షించబడ్డావు అని చెప్పి ఓదార్చారు. గాంధీ విగ్రహం వద్ద కూర్చుని ధర్నా కూడా చేసిన సంస్కృతి ఆయనది. మరి ఈయన సంస్కృతి ఏంటి? నేను అడుగుతూ ఉన్నా. ఇదేనా సుదీర్ఘ రాజకీయ అనుభవం. నీకు ఏమైంది?" అని అన్నారు. జగన్ పై హత్యాయత్నం జరిగిన తరువాత, రాష్ట్ర ముఖ్యమంత్రిగా కనీసం పరామర్శించాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉన్నా, ఆయన ఆ పని చేయలేదని మండిపడ్డారు.

Alipiri
Chandrababu
Murder Attempt
YSR
Jagan
YS Vijayamma
  • Loading...

More Telugu News