Andhra Pradesh: 28 ఓట్ల తేడాతో ఓడిపోయా.. ఆ బాధేంటో నాకు తెలుసు!: వైసీపీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి

  • జగన్ పాదయాత్రతో టీడీపీ నేతల్లో భయం
  • నవరత్నాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి
  • వైసీపీ శ్రేణులకు దిశానిర్దేశం

జగన్ పాదయాత్రతో రాబోయే ఎన్నికల్లో గెలుస్తామన్న నమ్మకాన్ని టీడీపీ నేతలు పోగొట్టుకున్నారని వైసీపీ నేత, మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి తెలిపారు. ఓటు విలువ ఏంటో తనకు తెలుసనీ, గతంలో తాను కేవలం 28 ఓట్ల తేడాతో ఓడిపోయానని గుర్తుచేసుకున్నారు. బూత్ లెవల్ వైసీపీ కార్యకర్తలతో సమావేశమైన రఘురామిరెడ్డి నియోజకవర్గంలో పార్టీ పరిస్థిితిని సమీక్షించారు.

వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని రఘురామిరెడ్డి సూచించారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి మెజారిటీ ఓట్లు దక్కేలా కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో వైసీపీ సొంత మెజారిటీతో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ నేతల కారణంగా అభివృద్ధిలో మైదుకూరు వెనుకపడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

Andhra Pradesh
Kadapa District
YSRCP
raghurami reddy
party meeting
  • Loading...

More Telugu News