Jagan: ఎడమ చేతిని మాత్రం తాకనీయద్దు: జగన్ కు వైద్యుల హెచ్చరిక!

  • రేపటి నుంచి ప్రారంభం కానున్న పాదయాత్ర
  • ఎడమ చేతిని పైకి లేపవద్దు
  • జగన్ కు సూచించిన వైద్యులు

రేపటి నుంచి వైఎస్ జగన్ ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభం కానుండగా, ఈ ఉదయం ఆయనకైన గాయాన్ని పరిశీలించిన వైద్యులు కీలక సూచనలు చేశారు. పాదయాత్ర సందర్భంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎడమ చేతిని ఎవరూ తాకకుండా చూసుకోవాలని, సాధ్యమైనంత వరకూ ఆ చేతిని పైకి లేపే ప్రయత్నం చేయవద్దని తెలిపారు.

ఈ మేరకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, లేకుంటే గాయం పూర్తిగా మానేందుకు సమయం పడుతుందని హెచ్చరించారు. ఈ మేరకు జగన్ యాత్రలో ఎడమవైపు ఎవరూ లేకుండా చూస్తామని వైకాపా వర్గాలు వెల్లడించాయి. కాగా, జగన్ తన పాదయాత్ర, ప్రసంగాల్లో తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మాదిరిగానే ఎడమ చేతిని పైకెత్తి అభివాదాలు చేస్తారన్న సంగతి తెలిసిందే.

Jagan
Padayatra
Left Hand
  • Loading...

More Telugu News