Indian Amerikan: భారతీయ సంతతి వ్యక్తికి అమెరికా సైన్స్‌ బోర్డు సభ్యుడి పదవి?

  • ఆచార్య సురేష్‌ వి.గరిమెళ్లకు దక్కనున్న అరుదైన అవకాశం
  • ప్రస్తుతం పర్దూ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న సురేష్‌
  • అవకాశం వస్తే ఆరేళ్లపాటు పదవిలో ఉంటారు

భారతీయ అమెరికన్‌కి అగ్రరాజ్యంలో అరుదైన గౌరవం దక్కనుంది. భారత సంతతికి చెందిన ప్రొఫెసర్‌ సురేష్‌ వి.గరిమెళ్లను ప్రతిష్ఠాత్మక అమెరికా సైన్స్‌ బోర్డు సభ్యుడిగా నియమించాలని వైట్‌హౌస్‌ నిర్ణయించినట్లు సమాచారం. సురేష్‌ మెకానికల్‌ విభాగం ప్రొఫెసర్‌. ఇండియానా రాష్ట్రలోని పర్దూ విశ్వవిద్యాలయంలో ఆచార్యునిగా సేవలందిస్తున్నారు. అమెరికా వైట్‌హౌస్‌ వర్గాల సమాచారం మేరకు సైన్స్‌ కాంగ్రెస్‌ సభ్యుడిగా  సురేష్‌ నియమితులైతే ఆరేళ్లపాటు ఆ పదవిలో కొనసాగుతారు. ప్రస్తుతం ఆయన కూలింగ్‌ టెక్నాజీస్‌ రీసెర్చి సెంటర్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.

  • Loading...

More Telugu News