Bandla Ganesh: ఆసక్తికరంగా రాజేంద్రనగర్ తెరపైకి సినీ నిర్మాత బండ్ల గణేశ్ పేరు!

  • కొలిక్కిరాని సీట్ల అంశం
  • రాజేంద్రనగర్ స్థానంపై ఆశ పెట్టుకున్న కార్తీక్‌రెడ్డి
  • గణేశ్‌కి కేటాయించాలని కోరిన లగడపాటి

మహాకూటమిలో సీట్ల అంశం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. కొన్ని స్థానాలు ఇంకా సందిగ్ధంలోనే ఉన్నాయి. అయితే రాజేంద్రనగర్ సీటు టీడీపీదా? లేదంటే కాంగ్రెస్సే తన కింద ఉంచుకుంటుందా? అనే చర్చలు జరుగుతున్నాయి. మరోపక్క ఈ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరుఫున సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ పేరు తెరపైకి రావడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఈ సీటు తనకే కేటాయిస్తారని ఇప్పటి వరకూ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తీక్‌రెడ్డి ఆశతో ఉన్నారు. తాజా పరిణామంపై ఆయనెలా స్పందిస్తారో చూడాలి. గ్రేటర్ హైదరాబాద్‌లో కమ్మ సామాజిక వర్గానికి ఒక్క సీటు కూడా కేటాయించలేదు. దీంతో రాజేంద్రనగర్ టికెట్‌ను గణేశ్‌కు కేటాయించాలని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తదితరులు కోరుతున్నట్టు తెలుస్తోంది.

Bandla Ganesh
Rajendranagar
Lagadapati Rajagopal
Telugudesam
Congress
Katthik Reddy
  • Loading...

More Telugu News