Chada Venkat Reddy: మహాకూటమి నుంచి బయటకు వెళ్లే ప్రసక్తే లేదు: చాడ వెంకట్‌రెడ్డి

  • మహాకూటమిని ప్రతిపాదించిందే మేము
  • సీట్ల సర్దుబాటులో జాప్యం వద్దని కోరా
  • నేడో, రేపో సీట్లు ఫైనల్ అవుతాయి

మహాకూటమిని ప్రతిపాదించిందే తామని.. కాబట్టి కూటమి నుంచి బయటకు వెళ్లే ప్రసక్తే లేదని సీపీఐ రాష్ట్ర అధ్యక్షుడు చాడ వెంకట్‌ రెడ్డి స్పష్టంచేశారు. నేడు మహాకూటమి నేతలంతా పార్క్ హయత్ హోటల్‌లో భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం చాడ మాట్లాడుతూ.. సీట్ల సర్దుబాటులో  జాప్యం వద్దని కాంగ్రెస్‌ను కోరినట్టు తెలిపారు.

నేడో, రేపో సీట్లు ఫైనల్ అవుతాయని.. సర్దుబాటులో తప్పనిసరిగా విజయవంతమవుతామని చాడ తెలిపారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలనకు వ్యతిరేకంగా ఏర్పడిన మహాకూటమిని ఎట్టి పరిస్థితుల్లో విచ్ఛిన్నం కానియ్యబోమని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో కూటమి నేతలు కుంతియా, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదండరాం, చెరకు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

Chada Venkat Reddy
Kunthiya
Uttam Kumar Reddy
Kodandaram
Cheruku Sudhakar
  • Loading...

More Telugu News