Allu Arjun: కేరళ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన బన్నీ

  • బన్నీకి సాదర స్వాగతం పలికిన కేరళ ప్రభుత్వం
  • ‘నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్‌’‌ వద్ద జెండా ఎగురవేసిన బన్నీ
  • కేరళ ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన స్టైలిష్ స్టార్



కేరళ ప్రభుత్వ ఆహ్వానం మేరకు నేడు అక్కడ జరుగుతున్న ‘నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్‌’‌కు ముఖ్య అతిథిగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హాజరయ్యాడు. కేరళలో బన్నీకి అభిమానులు భారీగానే ఉన్నారు. అక్కడి అభిమానులు ఆయనను మల్లు అర్జున్‌గా పిలుచుకుంటారు. అయితే అక్కడి ప్రభుత్వం బన్నీని సగౌరవంగా ఆహ్వానం పలికింది.

‘నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్‌’‌ వద్ద బన్నీ జెండా ఎగురవేశాడు. దీనికి సంబంధించిన ఫోటోను ట్విట్టర్ ద్వారా పంచుకోవడమే కాకుండా తనకు ఇంత గొప్ప గౌరవాన్ని కల్పించిన కేరళ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపాడు. 66వ నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్‌కి నన్ను ఆహ్వానించి.. జెండా ఎగురవేసే అవకాశం కల్పించినందుకు కేరళ ప్రభుత్వానికి కృతజ్ఞతలు. నాకు ఇంత గొప్ప గౌరవాన్నిచ్చినందుకు కేరళ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు’ అని బన్నీ ట్వీట్‌లో పేర్కొన్నాడు.

Allu Arjun
Kerala
Flag Hosting
Nehru Trophy Boat Race
  • Loading...

More Telugu News