Gandhi Bhavan: గాంధీభవన్ వద్ద అసంతృప్తుల ఆందోళన.. ఇద్దరు కార్యకర్తల ఆత్మహత్యాయత్నం

  • లక్ష్మారెడ్డికి టికెట్ ఇవ్వాలంటూ ఆత్మహత్యాయత్నం
  • మల్కాజ్‌గిరి టికెట్ శ్రీధర్‌కు ఇవ్వాలని ఆందోళన
  • రమేష్ రాథోడ్‌కు టికెట్ ఇవ్వొద్దంటూ నిరసన

గాంధీభవన్ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పార్టీ టికెట్ దక్కని కాంగ్రెస్ పార్టీ అసంతృప్త నేతలు తమ కార్యకర్తలతో ఆందోళన నిర్వహించారు. దీనిలో భాగంగా ఇద్దరు కార్యకర్తలు ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపుతోంది.

ఉప్పల్ టికెట్‌ను రాగిడి లక్ష్మారెడ్డికి ఇవ్వాలంటూ ఇద్దరు కార్యకర్తలు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. అలాగే మల్కాజ్‌గిరి టికెట్ నందికంటి శ్రీధర్‌కు ఇవ్వాలని, నకిరేకల్ టికెట్‌ను ప్రసన్న రాజుకు ఇవ్వాలంటూ వారి అనుచరులు ఆందోళన నిర్వహిస్తే.. ఖానాపూర్ టికెట్‌ను రమేష్ రాథోడ్‌కు ఇవ్వొద్దంటూ కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన చేపట్టారు.

Gandhi Bhavan
Ragidi Lakshma Reddy
Nandikanti Sridhar
Ramesh Rathod
  • Loading...

More Telugu News