Maganti Gopinath: ఎన్నికల ప్రచారంలో మాగంటి గోపీనాథ్ కు చేదు అనుభవం!

  • ఎన్నికల ప్రచారంలో గోపీనాథ్ ను నిలదీసిన ఓటర్లు
  • ఏమొహం పెట్టుకుని ఓట్లు అడగడానికి వచ్చావన్న మహిళ
  • గోపీనాథ్ కు టీఆర్ఎస్ టికెట్ ఇవ్వకూడదంటూ ఓ ఉద్యమకారుడి నిరసన

హైదరాబాద్ జూబ్లీహిల్స్ టీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ కు చేదు అనుభవం ఎదురైంది. ఇప్పటికే ఎంతో మంది టీఆర్ఎస్ అభ్యర్థులకు ఎదురైన నిరసన సెగ ఈరోజు గోపీనాథ్ కు కూడా తగిలింది. తన నియోజకవర్గంలో ఈరోజు గోపీనాథ్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సదర్భంగా సమస్యల పరిష్కారంపై ఆయనను ప్రజలు నిలదీశారు. ఓ సమస్యను పరిష్కరించాలని తన భర్త మిమ్మల్ని చాలాసార్లు కలిశారని... అయినా మీరు పట్టించుకోలేదని... ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఓట్ల కోసం వచ్చారని గోపీనాథ్ ను ఓ మహిళ నిలదీసింది. తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసి, టీడీపీ నుంచి గెలిచిన గోపీనాథ్ కు టీఆర్ఎస్ టికెట్ ఇవ్వకూడదని ఇద్రసేనా అనే ఉద్యమకారుడు పెట్రోల్ బాటిల్ చేతిలో పట్టుకుని ఆందోళనకు దిగాడు. ఇదే రీతిలో పలువురు ఓటర్లు ఆయన పట్ల నిరసన వ్యక్తం చేయడంతో... గోపీనాథ్ అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోయారు.

Maganti Gopinath
TRS
election
campaign
protest
  • Loading...

More Telugu News