Jagan: ప్రజాసంకల్ప యాత్ర, తన ఆరోగ్యంపై స్పందించిన వైఎస్ జగన్!

  • అభిమానుల ప్రార్థనలతో కోలుకున్నా
  • 12న ప్రజాసంకల్పయాత్రలో పాల్గొంటా
  • ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన వైసీపీ అధినేత

అభిమానుల ప్రార్థనలు, దేవుడి ఆశీస్సులు, తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి దీవెనలతో కత్తిదాడి నుంచి తాను కోలుకున్నానని ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ తెలిపారు. కష్టాల్లో ఉన్న రాష్ట్ర ప్రజలతో కలిసి అడుగులు వేసేందుకు, వారికి భరోసా ఇచ్చేందుకు ఈ నెల 12 నుంచి ప్రజాసంకల్ప యాత్రలో పాల్గొంటానని వెల్లడించారు. ఈ మేరకు ‘12వ తేదీ నుంచి మీ మధ్యకు వస్తున్నా. మీతోనే ఉంటా’ అన్న పేరుతో ఫేస్ బుక్ లో ఈ రోజు పోస్ట్ చేశారు.

కాగా, జగన్ పై హత్యాయత్నం ఘటనపై ఆయన కుటుంబ సభ్యులు రేపు ఉదయం 11 గంటలకు మీడియా ముందుకు రానున్నారు. వైసీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ ఈ సమావేశంలో మీడియాను ఉద్దేశించి మాట్లాడనున్నారు. జగన్ పై దాడి తదనంతర పరిణామాలపై ఆమె వివరణ ఇవ్వనున్నారు. గత నెల 25న విశాఖపట్నం ఎయిర్ పోర్టులో జగన్ పై శ్రీనివాసరావు అనే యువకుడు కోడికత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో జగన్ ఎడమ చేతికి 9 కుట్లు పడ్డాయి.

Jagan
YSRCP
prajasankalpa yatra
Vijayanagaram District
health
Andhra Pradesh
november 12
ready
  • Loading...

More Telugu News