paruchuri: 'అరవింద' క్లైమాక్స్ లో తారక్ పాత్రను అలా పైకి లేపొచ్చు: పరుచూరి గోపాలకృష్ణ
- త్రివిక్రమ్ గిలిగింతలు పెట్టే మాటలు రాస్తాడు
- ఈ సినిమాలో ఆయన మార్క్ డైలాగులు లేవు
- చివర్లో హీరోతో ఆ మాట చెప్పించి వుండాల్సింది
ఈ వారం 'పరుచూరి పాఠాలు' కార్యక్రమంలో పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ, 'అరవింద సమేత వీర రాఘవ' సినిమాను గురించి కొన్ని విషయాలు చెప్పుకొచ్చారు. " సాధారణంగా త్రివిక్రమ్ గిలిగింతలు పెట్టే డైలాగ్స్ ను చాలా బాగా రాస్తాడు. కానీ ఈ సినిమా క్లైమాక్స్ లో కూడా ఆయన అవి వదిలేసి, తాను నమ్ముకున్న కథను జస్టిఫై చేస్తూ ఎక్కువ డైలాగులు రాసుకున్నాడు. అవి కొంతమందికి ఎక్కకపోవచ్చు.
చివర్లో కూడా ఎన్టీఆర్ పాత్రను మరోసారి పైకి లేపొచ్చు. బసిరెడ్డి పారిపోయాడు అని తెలియగానే అందరూ భయంతో పరుగులు తీస్తుంటారు. అప్పుడు హీరో వాళ్లందరినీ ఆపి.. 'ఎవడైతే 5 రూపాయలకు చంపడం మొదలుపెట్టాడో, వాడే ఇవాళ ఇక్కడ లేడు. మీరెందుకురా పారిపోతారు .. ఇక ఇక్కడ నరుక్కోవడాలు ఉండవు' అని ఓదార్చి ఓన్ చేసుకుని వుంటే హీరోయిజం ఒక్కసారిగా పైకి లేచేది" అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.