America: అమెరికాలో మృతి చెందిన కరీంనగర్ విద్యార్థి.. గుండె నొప్పితో హఠాన్మరణం

  • బుధవారం రాత్రి మృతి చెందిన భార్గవ్
  • నెల రోజుల క్రితమే ఉద్యోగంలో చేరిక
  • కరీంనగర్‌లో విషాదం

కరీంనగర్‌కు చెందిన ఇట్టిరెడ్డి భార్గవ్ రెడ్డి (25) అమెరికాలో హఠాన్మరణం చెందాడు. బీటెక్ పూర్తి చేసిన అనంతరం ఉన్నత చదువుల కోసం 2016లో అమెరికా వెళ్లిన భార్గవ్, నార్త్ టెక్సాస్ యూనివర్సిటీలో ఇటీవలే ఎంఎస్ పూర్తి చేశాడు. నెలన్నర క్రితం ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా చేరాడు.

అమెరికా కాలమానం ప్రకారం బుధవారం రాత్రి గుండెల్లో నొప్పిగా అనిపించడంతో ఆసుపత్రికి వెళ్లాడు. లిఫ్ట్‌ కోసం వేచి చూస్తుండగా అకస్మాత్తుగా కిందపడి మృతి చెందాడు. కుమారుడి మృతి విషయం తెలిసి కరీంనగర్‌లోని అతడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు భార్గవ్ స్నేహితులు, అక్కడి తెలుగు వారు ప్రయత్నాలు చేస్తున్నారు.

America
Karimnagar District
Student
Heart attack
dead
  • Loading...

More Telugu News