Chandrababu: టికెట్ ఎవరికిచ్చినా.. కలసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నా: దానం నాగేందర్

  • మహాకూటమితో టీఆర్ఎస్ కు నష్టం లేదు
  • ఆంధ్రులకు కూడా కేసీఆర్ పై నమ్మకం ఉంది
  • తెలంగాణలో చంద్రబాబు కుట్రలు చేస్తే సహించం

ఖైరతాబాద్ టికెట్ ను తనకు ఇచ్చినా, లేక మరొకరికి ఇచ్చినా కలసి పని చేస్తానని టీఆర్ఎస్ నేత దానం నాగేందర్ తెలిపారు. తమ అధినేత కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా పని చేస్తానని చెప్పారు. మహాకూటమితో టీఆర్ఎస్ కు కలిగే నష్టం ఏమీ లేదని అన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా టీఆర్ఎస్ గెలుపును ఆపలేరని చెప్పారు.

ఏపీ ప్రయోజనాల కోసం చంద్రబాబు ఏం చేసినా తమకు అభ్యంతరం లేదని...కానీ, కూటమి పేరుతో తెలంగాణలో కుట్రలు చేస్తే మాత్రం సహించబోమని అన్నారు. విశ్వసనీయత గల నేత కేసీఆర్ అని... ఆయనపై ఆంధ్రులకు కూడా విశ్వాసం ఉందని చెప్పారు. కేసీఆర్ చేసిన అభివృద్ధి, చేపట్టిన సంక్షేమ పథకాలే టీఆర్ఎస్ ను గెలిపిస్తాయని అన్నారు.

Chandrababu
danam nagender
kcr
mahakutami
TRS
Telugudesam
  • Loading...

More Telugu News