Madras High Court: ‘సర్కార్’ వివాదం.. మురుగదాస్‌కు ఊరట కల్పించిన మద్రాస్ హైకోర్టు

  • జయలలితను కించపరిచేలా సన్నివేశాలున్నాయని వివాదం
  • థియేటర్ల వద్ద నిరసనలు, పోస్టర్ల చించివేతతో బీభత్సం
  • ముందస్తు బెయిలు మంజూరు చేసిన హైకోర్టు

మద్రాస్ హైకోర్టు ‘సర్కార్’ చిత్ర దర్శకుడు మురుగదాస్‌కు ఊరట కల్పించింది. సినిమాలో అన్నాడీఎంకే పార్టీకి వ్యతిరేకంగా, అలాగే మాజీ సీఎం దివంగత జయలలితను కించపరిచేలా సన్నివేశాలున్నాయని ఆ పార్టీకి చెందిన నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతే కాకుండా ‘సర్కార్’ ప్రదర్శితమవుతున్న థియేటర్ల వద్ద నిరసనలు, పోస్టర్ల చించివేతతో బీభత్సం సృష్టిస్తున్నారు.

దీంతో థియేటర్ల వద్ద, మురుగదాస్ నివాసం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముందు జాగ్రత్తగా మురుగదాస్ మద్రాస్ హైకోర్టులో ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నారు. నేటి సాయంత్రం దీనిపై విచారించిన కోర్టు ఆయనను ఈ నెల 27 వరకూ అరెస్ట్ చేయరాదని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.  

Madras High Court
Murugadoss
Anna DMK
Jayalalitha
Sarkar Movie
  • Loading...

More Telugu News